అక్కినేని వారసుడు సుశాంత్ కొత్త సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుండి ప్రారంభం అవుతుంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. సుశాంత్ హోం బ్యానర్ శ్రీ నాగ్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
‘కరెంటు’, ‘అడ్డా’ చిత్రాల తర్వాత సుశాంత్ నటించే చిత్రమిది. గాంధీ ఈ చిత్రం కోసం మంచి యూత్ ఫుల్ స్క్రిప్ట్ సిద్దం చేశారట. హీరోయిన్, ఇతర టెక్నీషియన్ల ఎంపిక జరుగుతుంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


