“బద్రి” రీ రిలీజ్ పై కొనసాగుతున్న సస్పెన్స్.!

“బద్రి” రీ రిలీజ్ పై కొనసాగుతున్న సస్పెన్స్.!

Published on Feb 2, 2023 5:04 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ ఏ లెవెల్లో ఊపందుకుందో తెలిసిందే. అలా వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలు భారీ వసూళ్లతో టాప్ లో నిలవగా ఇప్పుడు మరోసారి మరో సినిమా రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఆ సినిమానే మాస్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం “బద్రి”. అయితే ఈ సినిమా ఈ జనవరి 26నే రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ దానిని ఫిబ్రవరి 4 కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు మళ్లీ ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈసారి సినిమా అయితే ఫిబ్రవరి 18కి షిఫ్ట్ అయ్యినట్టు గా లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అయితే రేణుదేశాయ్ మరియు అమీషా పటేల్ లు హీరోయిన్స్ గా నటించగా రమణ గోగుల సంగీతం అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు