ఇప్పుడు మన టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్టులలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా ఒకటి. ఇప్పటికే ఇండియా వైడ్ హైప్ ను నమోదు చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విషయంలో పెద్ద సస్పెన్సే నడుస్తుంది.
వాస్తవానికి ఎప్పుడో రావాల్సిన ఈ ఫస్ట్ లుక్ కరోనా వలన ఆగిపోవాల్సి వచ్చింది. దీనితో ప్రభాస్ ఫ్యాన్స్ మరోసారి మరింత నిరాశ చెందారు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం ఈ జూన్ లోనే ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉందని విపరీతమైన బజ్ వినిపిస్తుంది. మరి ఈ నెలలో ఏం జరుగుతుందో ప్రభాస్ ఫ్యాన్స్ కు మెమొరబుల్ మంత్ గా ఈ జూన్ నిలుస్తుందో లేదో చూడాలి.


