ఈ ఏడాదికి సౌత్ లో భారీ బడ్జెట్ చిత్రంగా ‘ఐ’ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. కాకపోతే విడుదల తేదిపై సస్పెన్స్ వీడడంలేదు
చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా అనుకున్న సమయానికి(దీపావళికి) రాకపోవచ్చని భావిస్తున్నారు. నిర్మాతలు మాత్రం సినిమా విడుదలలో ఎటువంటి మార్పు వుండదని తెలుపుతున్నారు. దీపావళి సమయానికి తమిళనాడులో మరికొన్ని భారీ సినిమాల విడుదల కూడా ‘ఐ’ విడుదల తేదిని ప్రశ్నార్ధకంగా మారుస్తుంది
శంకర్ ఈ సినిమా తెలుగు, తమిళ ఆడియో విడుదల వేడుకలను ఏర్పాటు చేయడంలో బిజీగా వున్నాడు. రెహమాన్ సంగీత దర్శకుడు. విక్రమ్, అమీ జాక్సన్ హీరోయిన్స్


