అఖిల్ సరసన క్రేజీ హీరోయిన్ ?

Published on Apr 21, 2019 7:15 pm IST

అక్కినేని అఖిల్ కు ‘మిస్టర్ మజ్ను’ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దాంతో అఖిల్ తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు. తన తర్వాత సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే అఖిల్ కి హీరోయిన్ సెట్ కావట్లేదు. కియరా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నా.. ఆమె డేట్స్ ఎడ్జిస్ట్ కాలేదు. తాజాగా రష్మికా మండన్నను హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా కూడా, భాస్కర్ బొమ్మరిల్లు సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా మే రెండవ వారం నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :