“అఖండ” రిలీజ్ పై పెరుగుతున్న ఆసక్తి.!

Published on Aug 25, 2021 3:00 pm IST


నందమూరి నటసింహం నందమూరి నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం “అఖండ”. బాలయ్య మరియు బోయపాటి శ్రీనుల కాంబోలో తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై ఎప్పుడు నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ డేట్ పై స్ట్రాంగ్ బజ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇంకా టైం కాస్త తక్కువే ఉన్నా ఈ చిత్రం రిలీజ్ ని వచ్చే దసరాకే ఉండనుంది తెలుస్తుంది. రాజమౌళి బిగ్గెస్ట్ ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్ ‘RRR’ డేట్ కి అఖండ బ్లాస్ట్ ఉండనున్నట్టుగా మరింత ప్రచారం జరుగుతుంది. దీనితో మేకర్స్ నుంచి ఒక అధికారిక అప్డేట్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :