విడుదలకు సిద్ధమవుతున్న విజువల్ వండర్ !

విడుదలకు సిద్ధమవుతున్న విజువల్ వండర్ !

Published on Aug 8, 2018 6:11 PM IST

Suvarna Sundari
సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా “సువర్ణసుందరి”. ఈ చిత్రం శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా అద్భుతమైన కంటెంట్ మరియు అమేజింగ్ గ్రాఫిక్స్ తో తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. పునర్జన్మల నేపధ్యంలో రానున్న ఈ చిత్రంలో జయప్రదతో పాటు హీరోయిన్ పూర్ణ కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది.

ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలైయింది. అలాగే ఆగస్ట్ లో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్ లో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. “బాహుబలి, భజరంగీ భాయిజాన్” చిత్రాలకి వర్క్ చేసిన వి.ఎఫ్.ఎక్స్ టీం “సువర్ణసుందరి” చిత్రానికి కూడా వర్క్ చేస్తుండటం విశేషం.

కాగా ‘చ‌రిత్ర భ‌విష్య‌త్‌ ని వెంటాడుతోంది అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్‌తో విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ మూవీ రాబోతుంది. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత బాణీలు సమకూరుస్తుండగా నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్, అవినాష్‌ లాంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు