“సాహో సార్వ భౌమి” పాటతో రాబోతున్న ‘సువర్ణసుందరి’ !

సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలకపాత్రలో తెరకెక్కుతున్న సినిమా “సువర్ణసుందరి”. ఈ చిత్రం శ్రీ కృష్ణ దేవ‌రాయ‌ల స్టోరీ ఆధారంగా అద్భుతమైన కంటెంట్ మరియు అమేజింగ్ గ్రాఫిక్స్ తో తెర‌కెక్క‌నున్న‌ట్లు స‌మాచారం. పునర్జన్మల నేపధ్యంలో రానున్న ఈ చిత్రంలో జయప్రదతో పాటు హీరోయిన్ పూర్ణ కూడా ప్రధాన పాత్రను పోషిస్తోంది

కాగా సాయికార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నుంచి ” సాహో సార్వ భౌమి” అనే పాటను ఈ నెల 28న విడుదల చేస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలైయింది. భారీ బడ్జెట్ చిత్రాలకు మల్లే ఈ చిత్రంలో కూడా మంచి విజువల్స్ ఉన్నాయి. ఓ సాంకేతిక అద్బుతంగా ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి నిర్మిస్తున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

జయప్రద,పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎలు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి.

Exit mobile version