సర్కారు వారి పాట: మాసివ్ ట్రైలర్ కోసం గ్రాండ్ లాంఛ్ ఈవెంట్!

Published on May 1, 2022 5:26 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ సర్కారు వారి పాట. మే 12, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. రేపు సాయంత్రం విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లాంచ్ కోసం చిత్ర యూనిట్ గ్రాండ్ ఈవెంట్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మాస్ ధియేటర్ భ్రమరాంబ 70 ఎంఎం వద్ద ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఈవెంట్ మొదలు కానుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన తొలిసారిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, GMB ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకం పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :