మార్చి చివర్లో రానున్న స్వామిరారా

Published on Mar 3, 2013 6:50 pm IST

Swamy-Ra-Ra
యంగ్ హీరో నిఖిల్, స్వాతి జంటగా నటించిన ‘స్వామిరారా’ సినిమా విడుదలకు సిద్దమైంది. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యాలి కానీ అది కుదరలేదు, కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చెయ్యనున్నారు. సుదీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి చక్రి చిగురుపతి నిర్మాత. క్రైమ్ – కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అంతా ఓ వినాయక విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటుంది.

సన్నీ సంగీతం అందించిన ఈ సినిమా గురించి కో ప్రొడ్యూసర్ సందీప్ కొరిటాల మాట్లాడుతూ ‘ సన్నీ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిఖిల్, స్వాతి పాత్రలు చాలా వెరైటీగా ఉంటాయి. ఆడియన్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం ఉందని’ అన్నాడు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాలో పూజ, జీవ, రవిబాబు కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :