విష్ణువర్ధన్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి..

విష్ణువర్ధన్ దర్శకత్వంలో కలర్స్ స్వాతి..

Published on Jul 8, 2014 2:30 PM IST

Swathi
తెలుగమ్మాయి కలర్స్ స్వాతి తమిళంలో మరో కొత్త సినిమాకు సైన్ చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా ‘ సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించనున్న ‘యాచన్’ సినిమాలో స్వాతిని హీరోయిన్ ఛాన్స్ సొంతం చేసుకుంది. ‘వరుడు’, ‘రాజా రాణి’ సినిమాల ఫేం ఆర్య, తమిళ హీరో క్రేషణ్ హీరోలుగా నటిస్తున్నారు. యుటీవీ మోషన్ పిక్చర్స్ తో కలసి ఈ సినిమాను విష్ణువర్ధన్ నిర్మిస్తున్నారు.

స్వాతి ఈ సినిమాలో క్రేషణ్ సరసన నటిస్తుంది. ఇటివలే స్వాతి తమిళంలో వడకర్రీ(తెలుగులో కుల్ఫీ) తో విజయం అందుకుంది. వడ కర్రీ విజయంతో స్వాతికి ఈ అవకాశం వరించింది. తమిళంలో స్వాతి హిట్-ట్రాక్ ఘనంగానే ఉంది. ‘యాచన్’ సినిమా విజయం సాదిస్తే స్వాతి బిగ్ హీరోయిన్ల లీగ్ లో చేరుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

తాజా వార్తలు