నటి స్వాతి అలియాస్ కలర్స్ స్వాతి టాలీవుడ్ లో కొన్ని డీసెంట్ హిట్స్ సాధించిన తర్వాత బాగా పాపులర్ అయ్యింది. ఇటివలే కొన్ని తమిళ మరియు మలయాళ చిత్రాలు సైన్ చేసింది. ప్రస్తుతం ‘త్రిపుర’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ ద్విభాషా చిత్రంలో నటిస్తుంది.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. నటుడు నవీన్ చంద్ర ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. రాజ్ కిరణ్ దర్శకుడు. కోనా వెంకట్ స్క్రిప్ట్ అందించాడు.
క్రేజీ మీడియా బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. నవంబర్ మధ్యలో ఈ సినిమాను విడుదలచేసే అవకాశాలు వున్నాయి.


