అరుంధతి నిర్మాత ప్రభాస్ పాలోయింగ్ రేంజ్ చెప్పారు

Published on Aug 19, 2019 2:55 pm IST

ప్రముఖ సీనియర్ నిర్మాత మల్లెలమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిన్న జరిగిన సాహో ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథులలో ఒకరిగా హాజరయ్యారు. అశేష అభిమానులు, అతిరథ మహారథుల మధ్య ఘనంగా జరిగిన ఈ వేదిక పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి ప్రసంగించారు. తన కుటుంబంలో ఉన్న మూడు తరాల సభ్యులు ప్రభాస్ అభిమానులు అని కొనియాడారు. ఆయన మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి, అలాగే సతీమణి, చెల్లెలితో పాటు 10ఏళ్ళు నిండని మనవడు కూడా ప్రభాస్ ఫ్యాన్ అని ఆయన చెప్పు కొచ్చారు. అంటే ప్రభాస్ అన్ని వర్గాల, అన్ని తరాల అభిమాన హీరోగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు అన్నారు.

తెలుగు వాడి కీర్తి చాటిన బాహుబలి మూవీ తరువాత వస్తున్న సాహో కూడా ఘనవిజయం సాధించి మరో మారు దేశవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే చిత్ర యూనిట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఇక ప్రభాస్ , శ్రద్దా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో ఈనెల 30న నాలుగు ప్రధాన భాషలలో గ్రాండ్ గా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :