అంచనాలకు తగ్గట్లుగానే ఆకట్టుకున్న ‘సైరా’ ట్రైలర్ !

Published on Sep 18, 2019 5:42 pm IST

మెగా అభిమానులతో పాటు యావత్తు ప్రేక్షక లోకం ఎప్పటి నుండో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రానున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ట్రైలర్ తాజగా విడుదల అయింది. అంచనాలకి తగ్గట్లుగానే ట్రైలర్ భారీ తారాగణంతో భారీ విజువల్స్ తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన స్క్రీన్ ప్రేజన్సీతో ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. అలాగే డైలాగ్ లతో పాటు నటీనటులు గెటప్స్ వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. మొత్తానికి ప్రతి ఫ్రేమ్ అలరించేవిధంగా సాగింది. పైగా ట్రైలర్ లో భావోద్వేగమైన ఎమోషన్స్ ప్రత్యక ఆకర్షణగా నిలుస్తాయి.

ఇక భారీ అంచనాలతో ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More