షూటింగ్ పార్ట్ ముగించిన ‘సైరా’ !

Published on Jun 24, 2019 7:18 pm IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ ప్యాచ్ వర్క్ కి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఈ రోజుతో పూర్తయింది. అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. అందులో భాగంగా సీజీ వర్క్ సంబంధించి ప్రస్తుతం వివిధ కంపెనీలు సైరా కోసం పనిచేస్తున్నాయి. ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.

ఇక చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి నటులు నటిస్తుండటంతో.. సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More