‘సైరా నరసింహారెడ్డి’కి సౌండ్ మిక్సింగ్ పూర్తయింది !

‘సైరా నరసింహారెడ్డి’కి సౌండ్ మిక్సింగ్ పూర్తయింది !

Published on Sep 29, 2019 2:45 PM IST

syeera10

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నిటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా సౌండ్ మిక్సింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఎప్పుడో పదేళ్ల క్రితమే పరుచూరి బ్రదర్స్ ‘సైరా’ స్క్రిప్ట్ ను రాశారు. స్టార్ రైటర్స్ గా టాలీవుడ్ ని ఏలిన ఈ స్టార్ రైటర్స్ ఒక స్క్రిప్ట్ ను పదేళ్ల పాటు ప్రేమించి రాశారు.. అందుకే ఖచ్చితంగా సైరా స్క్రిప్ట్ ఓ రేంజ్ లో ఉంటుందని.. సినిమా ఎలాగూ విజువల్స్ పరంగా అద్భుతంగా ఉంటుందని.. అలాగే స్క్రిప్ట్ పరంగా కూడా ఆకట్టుకోబోతుందని తెలుస్తోంది.

కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు