త్వరలో రామ్ చరణ్ స్థానంలోకి చిరంజీవి !

16th, April 2018 - 10:51:53 AM


మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా రూపొందించిన కోయిలకుంట్ల ట్రెజరీ సెట్లో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ షూటింగ్ పూర్తయ్యాక ఉండబోయే కొత్త షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ చరణ్ సినిమా ‘రంగస్థలం’ కోసం వేసిన రంగస్థలం విలేజ్ సెట్స్ లో మరొక భారీ సెట్ ను నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సెట్ పనులు త్వరలోనే ముగియనున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ సినిమాను రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్లో అమితాబ్ బచ్చన్, నయనతారలు కూడ నటిస్తున్నారు.