‘సైరా’.. ఇంటెర్వెల్ ముందు, క్లైమాక్స్ ముందు అదిరిపోతుందట

Published on Sep 11, 2019 2:01 am IST

సుమారు రూ.270 కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. ఈ చిత్రంలో నటీ నటుల రెమ్యునరేషన్ తర్వాత అధిక మొత్తంలో బడ్జెట్ ఖర్చవుతోంది పోరాట సన్నివేశాలకేనట. ఇందులో సుమారు 10 భారీ ఫైట్స్ ఉంటాయట. వీటిలో ఒకటి ఇంటెర్వెల్ ముందు, ఇంకొకటి సినిమా ముగింపుకు ముందు వస్తుందట.

విరామ సమయానికి ముందు వచ్చే ఫైట్ అండర్ వాటర్ ఫైట్ అట. ఇది సినిమాకే ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తోంది. ముంబైలో షూట్ చేసిన ఈ ఫైట్ కోసం చిరు చాలా కష్టపడ్డారు. ఇక చివరి ఫైట్ అన్నిటికంటే పెద్దదని, భారీ వ్యయంతో, ఎక్కువమంది సభ్యులతో దాన్ని షూట్ చేశారని తెలుస్తోంది. ఇక సినిమా విఎఫ్ఎక్స్ పనులు 17 దేశాల్లో జరుగుతున్నాయి. ఈ విశేషాలన్నిటినీ చూస్తే ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందించడం కోసం ‘సైరా’ టీమ్ ఎంత కష్టపడుతుంది అర్థమవుతూనే ఉంది.

సుమారు 5 భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క హక్కులకు అన్ని భాషల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్.

సంబంధిత సమాచారం :

X
More