‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ సహా ఐదుగురు ముఖ్య అతిథులు

Published on Sep 12, 2019 10:35 pm IST

‘సైరా’ కోసం మెగా టీమ్ భారీ ప్రమోషన్లను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించడానికి సిద్దమవుతున్నారు. మొదట ప్రీ రిలీజ్ వేడుకను కర్నూల్ ప్రాంతంలో నిర్వహించాలనుకున్న టీమ్ కొన్ని కారణాల రీత్యా హైదరాబాద్ నగరంలోనే ఈవెంట్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో వేడుక చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్, స్టార్ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్, కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.

సుమారు రూ.270 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని మొత్తం నాలుగు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మొదటిసారి చిరంజీవి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తుండటంతో సినిమాపై మెగా అభిమానులు, ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

X
More