చిరు సైరా సినిమా లేటెస్ట్ న్యూస్ !

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 23 నుండి అమితాబ్ బచ్చన్, నయనతార షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. చిరంజీవి ఈ సినిమాలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నారు. జగపతిబాబు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నాడు.

పరుచూరి బ్రదర్స్, బుర్రా సాయి మాధవ్ ఈ సినిమాకు మాటలు రాస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాను చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి మొదటిసారి చారిత్రాత్మక నైపథ్యంలో సినిమా చేస్తున్నాడు. భారీ తారాగణం, ఉన్నతమైన నిర్మాణ విలువలతో సినిమా రూపొందించబడుతోంది. ఈ సినిమాలో కన్నడ నటుడు సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతిలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.