‘సైరా’ చిత్రం ప్రేక్షకులకు అంత గొప్పగా కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం అందులోని దేశభక్తి అనే పాయింట్. స్వాతంత్ర్యం కోసం తొలి సమరం ప్రారంభించిన వీరుడి కథ కావడం, ఆ పోరాటం కోసం ప్రాణాల్నే అర్పించడంతో ‘సైరా’ చిత్రం ఒక దేశభక్తుడి చిత్రంగా పేరు తెచ్చుకుంది. సినిమా చూసిన అందరూ కూడా ఈ తరం యువత తప్పక చూడాల్సిన చిత్రమని, సినిమా చూశాక స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల పట్ల, ప్రస్తుతం దేశం కోసం పనిచేస్తున్న సైకుల పట్ల గౌరవం రెట్టింపైందని అన్నారు.
అందుకే ఈ సినిమాను ఇండియన్ ఆర్మీకి చూపాలని కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ సంస్థ ధీరజ్ ఎంటెర్ప్రైజెస్ సంకల్పించారు. ఈ వారంలో కర్ణాటకలోని పలుచోట్ల వారి కోసం సుమారు 60 షోలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇదే పద్దతని ఏపీ, తెలంగాణల్లో కూడా అమలుచేసి సైనికులకు, పోలీసులకు ప్రత్యేకంగా చూపిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
