టీజర్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘సైరా’ !

Published on Aug 14, 2019 4:32 pm IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా అయితే తాజాగా ఈ సినిమా నుండి ‘సైరా మేకింగ్ వీడియో’ను విడుదల చేసింది చిత్రబృందం. నెటిజన్లను ఈ వీడియో బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ నెల 20న ఈ చిత్రం టీజర్ కూడా రిలీజ్ కానుంది. టీజర్ కోసం పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :