‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు !

‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ విడుదల తేదీ ఖరారు !

Published on Jun 19, 2019 4:14 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ ట్రైలర్ చిరు పుట్టినరోజు నాడు ఆగస్టు 22న విడుదల కానుందని తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ముమ్మరంగా జరుగుతుంది. అలాగే సీజీ వర్క్ సంబంధించి కూడా ప్రస్తుతం వివిధ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్ని పూర్తవుతాయట.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు