నైజాంలో స్ట్రాంగ్ గా ఉన్న సైరా

Published on Oct 6, 2019 10:17 am IST

నాలుగో రోజు కూడా మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి నైజాంలో మంచి వసూళ్లను సాధించింది. శనివారం ఈ మూవీ 2.56 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే మూడురోజులకు గానూ 14.5 కోట్ల షేర్ సాధించిన సైరా మొత్తంగా నాలుగు రోజులకు గాను 17.20 కోట్ల షేర్ రాబట్టింది. నేడు ఆదివారం కావడంతో పాటు దసరా సెలవుల సందర్భంలో వసూళ్ళలో పెరుగుదల కనబడే అవకాశం కలదు. నేటితో సైరా 20కోట్ల మార్కుని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఐతే సైరా 30కోట్లకు పైగా నైజాం థియరిటికల్ రైట్స్ బిసినెస్ చేసిన నేపథ్యంలో దసరా సెలవులలో ఇంకా మెరుగైన వసూళ్లు సాధించాల్సివుంది.

ఇక తెలుగు రాష్ట్రాలలోని మిగతా ఏరియాలలో కూడా సైరా వసూళ్లు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్ర చేయగా నయనతార, తమన్నా ఆయన సరనస హీరోయిన్స్ గా నటించారు. జగపతి బాబు, సుదీప్, అమితాబ్, విజయ్ సేతుపతి వంటి స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు.

సంబంధిత సమాచారం :

More