సైరా నరసింహారెడ్డి మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇంకా కేవలం కొద్దిరోజులలో ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో సైరా గ్రాండ్ గా విడుదల కానుంది. రాయలసీమకు చెందిన మొదటి తరం స్వాతంత్ర్య యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్ర చేస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నాలతో పాటు అమితాబ్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి నటిస్తున్నారు.
ఐతే సైరా చిత్రం ఏపీ ప్రభుత్వ ఓ కీలక నిర్ణయానికి కారణమైంది. చరిత్ర మరిచిన స్వాతంత్ర్య సమర యోధుడైన నరసింహారెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించుకొందని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోవడంతో పాటు, తగు చర్యలు చేపట్టే దిశలో ఏపీ గవర్నమెంట్ ఉన్నట్లు తెలుస్తుంది.


