‘సైరా’లో అనుష్క రోల్ పై క్లారిటీ !

‘సైరా’లో అనుష్క రోల్ పై క్లారిటీ !

Published on Jul 15, 2019 7:20 AM IST

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఆ పాత్రలోనే అనుష్క నటించిదట. అయితే అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో నటించనుందని గత కొన్ని రోజులు నుంచీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదట. అసలు ఈ సినిమాలో ఝాన్సీ లక్ష్మీబాయే లేదట. ఈ సినిమాలో అనుష్క పాత్ర స్టోరీ టెల్లర్ గా ఉంటుందని తెలుస్తోంది.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో సుదీప్, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు