సైరా టీజర్ థియేటర్లల్లో కూడా !
Published on Aug 21, 2018 12:49 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న’సైరా నర్సింహా రెడ్డి’ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. సినిమా ఫై అంచనాలు పెంచేసిన ఈ టీజర్ కొద్దీ రోజుల్లో థియేటర్లలో కూడా ప్రదర్శింప బడనుంది. ఈవిషయాన్ని స్వయంగా ఈచిత్ర నిర్మాత రామ్ చరణ్ వెల్లడించారు. సౌత్ ఇండియా వ్యాప్తంగా థియేటర్లలో ఈ టీజర్ ప్రేక్షకులముందుకు రానుంది అని ఆయన అన్నారు. అయితే టీజర్ లో గుర్రాలకు సంభందించిన సన్నివేశాలు ఉండడంతో సెన్సార్ బోర్డు ఆమోదం అవసరం కానుంది. బోర్డు నుండి పర్మిషన్ వచ్చాక ఈ టీజర్ థియేటర్లలోకి రానుంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి , సుధీప్, తమన్నా వంటి భారీ తారాగణం నటిస్తున్నారు.నయనతార కథానాయికగా నటిస్తున్న ఈచిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదలకానుంది.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook