సాహో టెక్నిక్ ఫాలో అవుతున్న సైరా టీం…!

Published on Aug 20, 2019 1:36 pm IST

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగా హీరోల మెగా ప్రాజెక్ట్ సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తుండగా, తండ్రి చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా నటిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రాన్ని రెండు వందలకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం.

కాగా నేడు ఈ మూవీ టీజర్ ని ముంబై వేదికగా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం ముంబై వెళ్లిన చిత్రం బృందం ఆ ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.బాలీవుడ్ చిత్ర ప్రముఖులు అతిధులుగా, అక్కడి పాత్రికేయుల సమక్షంలో నేడు మధ్యాహ్నం 2:40 నిమిషాలకు సైరా టీజర్ ని విడుదల చేయనున్నారు. ఐతే ముంబైలో ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయడం ద్వారా జాతీయ స్థాయిలో సైరా చిత్రానికి ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.తెలుగు,తమిళంతో పాటు హిందీలో కూడా ఈ మూవీ విడుదల కానున్న తరుణంలో ముంబై వేదికగా ఈ చిత్ర టీజర్ ని విడుదల చేయడం మూవీకి కలిసొచ్చే అంశమే.

టాలీవుడ్ నిర్మించిన మరో భారీ చిత్రం సాహో ట్రైలర్ ని కూడా ఇటీవల ముంబైలోనే విడుదల చేయడం జరిగింది. దీనితో సాహో ప్రచార మంత్రాన్నే సైరా కూడా ఫాలో అవుతున్నట్లు అర్థం అవుతుంది. మరి భారీ బడ్జెట్ చిత్రాలు ఆ స్థాయి వసూళ్లు సాధించాలంటే ఇలా జాతీయ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టడం అనేది అనివార్యం.

సంబంధిత సమాచారం :