కొత్త రికార్డు సృష్టించిన సైరా టీజర్ !

Published on Aug 22, 2018 12:11 pm IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నర్సింహారెడ్డి. ఆయన బర్త్ డే కానుకగా ఈ చిత్రం యొక్క టీజర్ను నిన్న విడుదలచేశారు. విడుదలైన 24గంటల్లో 12 మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డును క్రియేట్ చేసింది. ఇక ఇప్పటివరకు తెలుగులో కేవలం 24 గంటల్లో అత్యధిక వ్యూస్ ను రాబట్టుకున్న చిత్ర టీజర్ సైరా నే కావడం విశేషం.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More