సైరా టీజర్ రిలీజ్ డేట్ ఖరారు !

Published on Aug 15, 2018 11:30 am IST

మెగా అభిమానులు ఎంత గానో ఎదురుచూస్తున్న’ సైరా’ టీజర్ విడుదల తేదీ ఖరారు అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కానుకగా ఒక రోజు ముందే అంటే ఆగస్టు 21న ఉదయం 11:30 గంటలకు ఈ టీజర్ రిలీజ్ కానుంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరక్కిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ,విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా మొదలగ భారీ తారాగణం నటిస్తుంది. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం ఫై రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈచిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం :

X
More