మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ 2 విడుదల కానుంది. రేపు ఉదయం 8 గంటలకు ఈ ట్రైలర్ 2 విడుదల కానుందని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా తెలియజేసింది. ఇటివలే రిలీజ్ అయిన ట్రైలర్.. అంచనాలకి తగ్గట్లుగానే భారీ తారాగణంతో భారీ విజువల్స్ తో బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన స్క్రీన్ ప్రేజన్సీతో ట్రైలర్ లో హైలెట్ గా నిలిచారు. అలాగే డైలాగ్ లతో పాటు నటీనటులు గెటప్స్ వారి పాత్రల తాలూకు ఎలివేషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ స్ చాల బాగున్నాయి. మొత్తానికి ప్రతి ఫ్రేమ్ అలరించేవిధంగా సాగింది. పైగా ట్రైలర్ లో భావోద్వేగమైన ఎమోషన్స్ ప్రత్యక ఆకర్షణగా నిలిచాయి. మరి ట్రైలర్ 2 లో ఎలా ఉండబోతుందో చూడాలి.
కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.


