సైరా ఈవెంట్ కి ఆయన అందుకే రాలేకపోతున్నారు.

సైరా ఈవెంట్ కి ఆయన అందుకే రాలేకపోతున్నారు.

Published on Sep 13, 2019 10:30 AM IST

కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై హీరో రామ్ చరణ్ నిర్మాతగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా. రాయసీమకు చెందిన మొదటితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. వచ్చేనెల 2న సైరా తెలుగు హిందీ,తమిళ భాషలలో భారీగా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 18న ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకతో పాటు, ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుపనున్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా సినీ ప్రముఖులతో పాటు, తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ హాజరుకానున్నారు.

ఐతే ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోతున్నట్లుగా ప్రచార మాధ్యమాలలో ద్వారా తెలుస్తుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ కొణిదెల ప్రొడక్షన్స్ అధికారిక ట్విట్టర్ పోస్ట్ వేయడం జరిగింది. కేటీఆర్ గారికి కొన్ని ఇతర అధికారిక కార్యక్రమాలలో పాల్గొనవలసి ఉండటం వలన ఆయన ఈ ఈవెంట్ కి రాలేకపోతున్నారు అని వివరణ ఇచ్చారు. ఐతే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుండి పవన్ కళ్యాణ్, రాజమౌళి,వివి వినాయక్, కొరటాల శివ హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, తమన్నా, అమితాబ్,కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి,జగపతి బాబు వంటి ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు