సైరా ఎలా ఉండబోతుందో పవన్ శాంపిల్ చూపించాడు.

Published on Aug 19, 2019 12:28 pm IST

రేపు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సైరా మూవీ టీజర్ విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో పీరియాడిక్ మూవీ గా తెరకెక్కుతున్న సైరా పై భారీ అంచనాలున్న నేపథ్యంలో టీజర్ ఏ స్థాయిలో ఉండబోతుందో అని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ టీజర్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే.

కాగా నేడు పవన్ సైరా టీజర్ కొరకు డబ్బింగ్ చెప్పిన మేకింగ్ వీడియోను కొణిదెల ప్రొడక్షన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో విడుదల చేయడం జరిగింది. ఒక ఉద్యమ వీరుడి ఆవేశం ప్రతిబింబించేలా, నరసింహారెడ్డి వీరత్వాన్ని తెలియజేసేలా పవన్ ఆవేశంగా చెప్పిన “సైరా నరసింహారెడ్డి…” అనే చిన్న మాట గూస్ బమ్స్ కలిగేలా ఉంది. ఇక పూర్తి స్థాయి టీజర్ లో తెర వెనుక పవన్ వాయిస్ తెరపై సైరా గా చిరంజీవిని ఏ స్థాయిలో ఆవిష్కరించ నుందో తలచుకుంటుంటేనే మతిపోతుంది. పవన్ ఆవేశ పూరితంగా చెప్పిన డైలాగులు సైరా పాత్ర వీరావేశము ఏ స్థాయిలో ఉంటుందో శాంపిల్ చూసినట్లే ఉంది.

అమితాబ్, జగపతి బాబు,నయనతార, తమన్నా,విజయ్ సేతుపతి,సుదీప్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న సైరా మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, అక్టోబర్ 2న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :