తాప్సీ కోరిక నెరవేర్చిన డైరెక్టర్

తాప్సీ కోరిక నెరవేర్చిన డైరెక్టర్

Published on Jan 17, 2016 8:46 PM IST

Tapsee-2
సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకున్న అందాల భామ తాప్సీ ఈ మధ్య తెలుగులో సినిమాలు చేయడం తగ్గించింది. తెలుగులో గ్లామర్ ప్రాధాన్యం ఉన్న సినిమాలే ఎక్కువగా వస్తుండడం వలన తాప్సీ తెలుగులో ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటోంది. ఈ గ్యాప్ లో తమిళంలో, హిందీలో నటనకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ బిజీగానే ఉంటోంది. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ అయిన షూజిత్ సిర్కార్ తాప్సీ చిన్ననాటి కోరికని తీర్చనున్నాడు.

అసలు మాటర్ ఏంటంటే గత ఏడాది పీకు తో మెప్పించిన షూజిత్ సిర్కార్ డైరెక్ట్ చేయనున్న నెక్స్ట్ మూవీ ‘ఆగ్రా గ దాబ్రా’. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నాడు. ఈ విషయంలో తాప్సీ తెగ సంబరపడిపోతోంది. ‘నేను చిన్నప్పటి నుంచీ ఆయన సినిమాలని చూసి పెరిగాను. ఇప్పుడు ఆయన పక్కనే నటించే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఆ మోమెంట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నానని’ తాప్సీ తెగ సంబరపడిపోతోంది.

తాజా వార్తలు