వైవిధ్యభరితమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటూ ఇప్పుడున్న యువహీరోల్లో తనకంటూ ఓ మంచి గుర్తింపును, మార్కెట్ ను ఏర్పరుచుకుంటూ సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఈ ఏడాది ‘టైగర్’తో మంచి హిట్ కొట్టిన సందీప్ ఇటీవలే ఓ తమిళ సినిమా షూటింగ్ ఫినిష్ చేసాడు. అది ఫినిష్ చేసిన వెంటనే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో ఒకటి ఒక్క అమ్మాయి తప్ప అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ అయితే మరొకటి సివి కుమార్ డైరెక్షన్ లో చేసే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. ఈ రెండు చిఎన్మాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.
తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్ అయిన పిజ్జా, విల్లా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సివి కుమార్ ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తో దర్శకుడిగా మారన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ కోసం అందాల భామ తాప్సీతో చర్చలు జరుపుతున్నాడని ఇదివరకే తెలియజేశాం. ఫైనల్ గా ఈ సినిమాకి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో తను ఓకే పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. ఏకకాలంలో పెద్ద ఎత్తున తెరకెక్కనున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్ సంస్థ, దర్శక నిర్మాత సీవీ కుమార్ తో కలిసి నిర్మిస్తోంది.


