తన ప్రియుడు గురించి చెప్పిన తాప్సీ !

Published on Sep 11, 2019 4:54 pm IST

గ్లామర్ బ్యూటీ తాప్సీ ఎట్టకేలకూ తానూ ప్రేమలో ఉన్నానని అంగీకరించింది. అయితే తాను ఎవరితో రిలేషన్‌షిప్‌ లో ఉందో.. ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. కానీ ఆ వ్యక్తి గురించి క్లారిటీగా చెప్పుకొచ్చింది. తాను ప్రేమిస్తున్న వ్యక్తి యాక్టరో, క్రికెటరో కాదని.. అని ఆ వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది. తాప్సీ తన సోదరి షగున్‌ తో కలిసి తాజాగా ఓ వెబ్‌ సైట్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలోనే తన ప్రేమకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

తాప్సీ మాట్లాడుతూ.. ‘నా లైఫ్ లో ఉన్న వ్యక్తి.. మీరనుకున్నట్లు అందరూ ఇంట్రస్ట్ చూపే రంగానికి చెందినవ్యక్తి కాదు. ముఖ్యంగా అతను యాక్టరో, క్రికెటరో అసలే కాదు, పైగా చాల దూరంగా ఉన్నాడు అని అంది. అయితే ఈ విషయం పై తాప్సీ సిస్టర్ షగున్‌ మాట్లాడుతూ.. తన ద్వారానే తాప్సీకి ఆ వ్యక్తి పరిచమయ్యాడని, తాప్సీ నాకు కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఆ వ్యక్తిని తాప్సీ ఎలా ఇష్టపడిందో అర్థం కావడం లేదు. తను విభిన్నమైన వ్యక్తి అని చెప్పింది.

సంబంధిత సమాచారం :

X
More