న్యూ ఇయర్ బాష్ కి బిజీగా వుండనున్న తాప్సీ పన్ను

tapsii
2014 ముగియనుండడంతో ఎక్కడ చూసినా పండగ వాతావరణంతో సందడి నెలకొంది. ప్రముఖ నగరాలలో ఎన్నో న్యూ ఇయర్ బాష్ లు జరగనున్నాయి. వాటిలో మన స్టార్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.

కాని టాలెంటెడ్ నటి తాప్సీ ‘ముని 3’ షూటింగ్ లో బిజీ గా వుండడం వల్ల ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొనలేకపోతుంది. ఈ షూటింగ్ ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ యేడాది చివరలోపు పూర్తి చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఇదిలా వుండగా తాప్సీ అక్షయ్ కుమార్ రానా ల సరసన నటించిన బాలీవుడ్ చిత్రం ‘బేబీ’ త్వరలో విడుదలకానుంది.

Exit mobile version