సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ‘తక్షక’.. పోస్టర్ విడుదల చేసిన వి.వి.వినాయక్

సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ‘తక్షక’.. పోస్టర్ విడుదల చేసిన వి.వి.వినాయక్

Published on May 22, 2026 8:00 AM IST

కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘తక్షక’. ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి ఈ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పడుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై డాక్టర్ లతా రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మహాభారత కాలం నుంచి నేటి వరకు జరిగే పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ కథను రూపొందించినట్లు నిర్మాత లతా రాజు తెలిపారు. సైన్స్ ఫిక్షన్‌తో పాటు పౌరాణిక అంశాలను ముడిపెడుతూ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఆమె వివరించారు. కృష్ణ మల్లిడితో తనకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉందని, హీరోగా కుశాల్ రాజు, దర్శకుడిగా కృష్ణ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని వి.వి. వినాయక్ ఆకాంక్షించారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, సీజీ (CG) పనుల దశలో ఉందని దర్శకుడు కృష్ణ మల్లిడి పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు