ఇళయదళపతి విజయ్ నటించనున్న తన 63వ చిత్రాన్ని అట్లీ తో చేయనున్నాడని తెలిసిందే. వీరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా. ఇంతకుముందు అట్లీ , విజయ్ తో ‘తెరి ,మెర్సల్’ చిత్రాలను తెరకెక్కించాడు. ఈరెండు కూడా బ్లాక్ బ్లాస్టర్ విజయాలను సాధించాయి. దాంతో ఈ కొత్త చిత్రం ఫై అంచనాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ చిత్రం లో విజయ్ కోచ్ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రం యొక్క షూటింగ్ ఈ నెల 22 న కానీ స్టార్ట్ కానుంది. పది సంవత్సరాల తరువాత మళ్ళీ విజయ్ తో కలిసి నటిస్తుంది నయన తార. ఇక ఈచిత్రంలో యువ హీరో కథిర్ ముఖ్య పాత్రలో నటించనున్నాడు
భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదలకానుంది.


