మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘సైరా’. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఇప్పటికే పలు పరిశ్రమల ప్రముఖ నటీ నటులు నటిస్తుండగా ఇపుడు మరొక పాపులర్ నటుడు కూడ వారిలో జాయిన్ అయ్యారు.
ఆ నటుడు మరెవరో కాదు ‘రేసు గుర్రం’ చిత్రంతో ప్రతినాయకుడిగా పరిచయమైన రవి కిషన్. ‘సైరా’ లో ఈయన కొంత నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని, ఇప్పటికే ఆయన తాలూకు కొన్ని సన్నివేశాలని చిత్రీకరించడం జరిగిందని తెలుస్తోంది. రామ్ చరణ్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతిలు నటిస్తున్న సంగతి తెలిసిందే.
