చరణ్ తో సినిమా పై టాలెంటెడ్ డైరెక్టర్ క్లారిటీ !

Published on Apr 11, 2021 5:20 pm IST

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కథ వినిపించాడని.. చరణ్ కూడా కథ విని బాగుందని అన్నాడని.. ఈ ఏడాది నవంబర్ లో దీపావళికి స్పెషల్ గా ఈ సినిమాని మొదలుపెట్టనున్నారని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తల పై దర్శకుడు గౌతమ్ తిన్నసూరి స్పందిస్తూ.. ‘తను ప్రస్తుతం జెర్సీ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నానని.. తానూ ఏ తెలుగు హీరోకు ఇంతవరకు కథ చెప్పలేదని.. ముఖ్యంగా చరణ్‌తో నేను సినిమా చేయనున్నట్టు వస్తున్న వార్తలన్ని అవాస్తవం అని గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు.

ఇక గౌతమ్ లాస్ట్ మూవీ ‘జెర్సీ’ సూపర్ హిట్ టాక్ తో పాటు క్లాసిక్ మూవీ అని అనిపించుకుంది. పైగా గౌతమ్ ‘జెర్సీ’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. అయితే తెలుగు జెర్సీలో కొన్ని మార్పులు చేసి హిందీలోకి తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ముఖ్యంగా హీరో కొడుకు పాత్రను కొత్తగా రాసినట్లు అలాగే తండ్రి పాత్ర మధ్యలో ఆపేసిన క్రికెట్ జర్నీని, కొడుకు పాత్ర కంటిన్యూ చేస్తోన్నట్లు గౌతమ్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేశాడట. మరి గౌతమ్ తిన్ననూరి హిందీలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి

సంబంధిత సమాచారం :