టాక్ : మరోసారి మాస్ రాజా కి జోడీగా ఇలియానా ?

టాక్ : మరోసారి మాస్ రాజా కి జోడీగా ఇలియానా ?

Published on Nov 30, 2023 1:31 AM IST


మాస్ మహారాజా రవితేజ ఇటీవల యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ టైగర్ నాగేశ్వరరావు ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం మరొక యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనితో రవితేజ చేస్తున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈగిల్. ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

విషయం ఏమిటంటే, మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ ఒక మూవీ చేయనున్నట్లు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించనుండగా ఇందులో రవితేజ కి జోడీగా ఇలియానా నటించనున్నారు అనేది లేటెస్ట్ టాక్. కాగా ఈ మూవీ మాస్ యాక్షన్ తో కూడిన ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందట. గతంలో రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో కిక్, ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని మూవీస్ తెరకెక్కిన విషయం తెలిసిందే. త్వరలో ఈ మూవీ గురించిన పూర్తి వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు