టాక్ : మరో సెన్సేషనల్ మల్టీస్టారర్ సెట్ చేస్తున్న కొరటాల శివ..?

Published on Nov 18, 2021 9:05 pm IST


ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల హవా నడుస్తుంది. ఒకదాన్ని మించిన ఒకటి కాంబోతో అదిరే సినిమాలు ఇప్పుడు టాలీవుడ్ నుంచి వస్తున్నాయి. ఆల్రెడీ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మూడు క్రేజీ మల్టీ స్టారర్ లు ఉన్నాయి. ఇక ఆ తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తీసిన మెగా మల్టీ స్టారర్ “ఆచార్య” కూడా ఫిబ్రవరి రిలీజ్ కి రెడీగా ఉంది.

మరి చిరు చరణ్ లతో చేసిన ఈ భారీ సినిమా అలానే దానికి ముందు ఎన్టీఆర్ మోహన్ లాల్ తో ఇంకో మల్టీ స్టారర్ కూడా కొరటాల చేశారు. ఇక కొరటాల నుంచి ఇంకో సెన్సేషనల్ మల్టీ స్టారర్ రాబోతుంది అంటూ క్రేజీ గాసిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అది కూడా నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబులతో అట. ఈ సౌండింగ్ బాగానే ఉంది కానీ ఇందులో ఎంతమేర నిజముందో అనేది తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :