టాక్..అవైటెడ్ “సర్కారు వారి మొదటి పాట” అప్పుడా.?

Published on Dec 9, 2021 8:00 am IST

ఇప్పుడు అంతా రిలీజ్ కి దగ్గరగా ఉన్న భారీ సినిమాల అప్డేట్స్ తోనే సోషల్ మీడియా టైం లైన్ మరియు సినీ వర్గాల్లో సందడిగా మారిపోయింది. దీనితో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” పై అప్డేట్స్ తగ్గాయి. సంక్రాంతి పోటీ నుంచి విరమించుకొని పలు కారణాల చేత ఏప్రిల్ నెలకి ఈ సినిమా షిఫ్ట్ అయ్యింది.

దీనితో ఇప్పట్లో అప్డేట్స్ అయితే సినిమా నుంచి లేవని క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు తమ సినిమాల మ్యూజిక్ కి సంబంధించి ఒక్క మహేష్ ఫ్యాన్స్ తప్ప మిగతా అందరూ తమ హీరోల పాటలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీనితో సర్కారు వారి మొదటి పాట రిలీజ్ మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ సాంగ్ పై లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.

దీని ప్రకారం అయితే బహుశా ఈ సాంగ్ వచ్చే జనవరి మొదటి వారంలోనే రిలీజ్ కావచ్చట. డేట్ కూడా నాలుగు లోపే అని అంటున్నారు కానీ దీనిపై మాత్రం ఒక అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా థమన్ మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :