టాక్..”పుష్ప” నుంచి ఆల్ మోస్ట్ గిఫ్ట్ ఇదే.!

Published on Apr 3, 2021 3:07 pm IST

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా నుంచి ఈరోజే ఓ సాలిడ్ అప్డేట్ ను మేకర్స్ విడుదల చేసారు. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ ఓ మైండ్ బ్లోయింగ్ వీడియో క్లిప్ తో వచ్చే బన్నీ బర్త్ డే సందర్భంగా ట్రీట్ ఉందని కన్ఫర్మ్ చేసారు.

అయితే ఒకటే వీడియోను ప్లాన్ చేస్తున్న మేకర్స్ నుంచి అసలు టీజర్ వస్తుందా లేక జస్ట్ బన్నీపై గ్లింప్స్ వస్తుందా అన్న ప్రశ్నకు సమాధానం వినిపిస్తుంది. మరి ఈ లేటెస్ట్ టాక్ ప్రకారం పుష్ప నుంచి సాలిడ్ టీజర్ కట్ నే మేకర్స్ విడుదల చేసే ప్లాన్ ఉన్నారని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వచ్చే ఆగష్టు 13న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :