టాక్..వెంకీ మామ ఈ సినిమా థియేటర్స్ వైపు.?

టాక్..వెంకీ మామ ఈ సినిమా థియేటర్స్ వైపు.?

Published on Sep 1, 2021 4:00 AM IST

Drishyam 2

మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ స్టార్ హీరోస్ లో ఆల్ టైం అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ మొదటి స్థానంలో ఉంటారు. మరి వెంకీ మామ రీసెంట్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “నారప్ప” డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. మరి దీనితో పాటుగా వెంకీ మామ మరిన్ని సినిమాలు లైన్ లో ఉండగా ఆల్రెడీ షూట్ కంప్లీట్ అయ్యిపోయిన మరో చిత్రం “దృశ్యం 2”.

ఇది వరకే హిట్ అయ్యిన మళయాళ బ్లాక్ బస్టర్ కి ఇది రీమేక్ ఆ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ నే జెట్ స్పీడ్ లో ఈ సినిమాని కూడా కంప్లీట్ చేసేసారు. అయితే ఈ థ్రిల్లర్ చిత్రం కూడా నారప్ప లానే ఓటిటి లోనే రిలీజ్ అవుతుంది అని ఆ మధ్య ఊహాగానాలు వినిపించాయి కానీ ఇప్పుడు మాత్రం ఈ చిత్రం బహుశా థియేట్రికల్ రిలీజ్ ఉండొచ్చని తెలుస్తుంది.

అయితే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు కానీ ఈ టాక్ అయితే వినిపిస్తుంది. ఇప్పటికే నారప్ప ఓటిటి రిలీజ్ విషయంలో అంతా డిజప్పాయింట్ గా ఉన్నారు మరి దీని విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు