ప్రతి సినిమాలో పాలరాతి శిల్పంలా నిగ నిగ మెరిసిపోయే కుర్రకారు కలల సుందరి తమన్నాను అతిలోక సుందరిలా చూపించారు దర్శకధీరుడు రాజమౌళి. రాజమౌళి తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక సినిమా ‘బాహుబలి’లో అవంతిక పాత్రలో తమన్నా నటిస్తుంది. నేడు తమన్నా పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి’లో తమన్నా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ లుక్ కు అద్బుత స్పందన లభించింది.
తమన్నా సోయగాన్ని వర్ణించడానికి కుర్రాళ్ళకు మాటలు రావడం లేదు. పాలరాతి శిల్పానికి మరింత మెరుగు పెట్టారు రాజమౌళి. వెనుక ఆ జలపాతాలు, తెల్లటి వస్త్రాలలో తమన్నా స్వర్గం నుండి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఉంది. అభిమానులకు ఈ లుక్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది.
ఎప్పటికీ గుర్తుండిపోయేలా తమన్నాకు రాజమౌళి పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు. తన కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోతుందని తమన్నా భావిస్తుంది. సినిమా కోసం పుట్టినరోజు నాడు కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. బల్గేరియాలో ‘బాహుబలి’ షూటింగ్ స్పాట్ లో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది.


