సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్స్ లో మిల్క్ బ్యూటీ తమన్నా ఒకరు.. తమన్నా ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్ర టీం బల్గేరియాలో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఐస్ తో నిండి ఉన్న బల్గేరియాలో జరుగుతున్న షూటింగ్ లో ప్రభాస్, తమన్నా పాల్గొంటున్నారు.
తమన్నా ఈ బల్గేరియా షూట్ లో బాగా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఎంజాయ్ మెంట్ లో భాగంగా తమన్నా అక్కడ తీసుకుంటున్న కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను తన ఇంస్టాగ్రం మరియు ట్విట్టర్ అకౌంట్స్ లో పోస్ట్ చేస్తోంది. దీన్ని బట్టి తమన్నా బాహుబలి షూటింగ్ ని బాగా ఎంజాయ్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘బాహుబలి’ ఫస్ట్ పార్ట్ 2015 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానంది.
కొద్ది నెలల గ్యాప్ లో సెకండ్ పార్ట్ రిలీజ్ అవుతుంది. మరో హీరోయిన్ గా అనుష్క కనిపించనున్న ఈ సినిమాలో రానా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఆర్కా మీడియా వారు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.


