
ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన మిల్క్ బ్యూటీ తమన్నా ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో గ్లామరస్ గా కనిపించడమే కాకుండా, పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్న ఈ మిల్క్ బ్యూటీ ఇటీవలే జ్యువెలరీ బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. అంతే కాకుండా తన జ్యువెలరీ బ్రాండ్ కి వైట్ అండ్ గోల్డ్ అనే పేరుని కూడా పెట్టింది. కొద్ది ఒర్జుల కిర్తమే వెయిట్ అండ్ గోల్డ్ షో రూం ని కూడా లాంచ్ చేసింది.
అందులో తన భిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేసిన నగలు ఉంటాయని చెప్పిన తమన్నా ఇప్పుడు ఈ వైట్ అండ్ గోల్డ్ కోసం జ్యువెలరీ డిజైనర్ గా కూడా మారింది. తను డిజైనర్ గా మారడం గురించి చెబుతూ ‘నా చిన్న తనంలోనే జ్యువెలరీ డిజైనింగ్ నన్ను ఆకర్షించింది. అప్పట్లో నాన్న కూడా జ్యువెలరీ బిజినెస్ లో ఉండడం వలన ప్రోత్సహించేవారు. నేను డిజైన్ చేసిన మోడల్స్ నాకు చాలా బాగా నచ్చేవి, అందుకే ఈ జ్యువెలరీ రంగంలోకి అడుగుపెట్టాను. నేను డిజైన్ చేసే నా ఫేవరైట్ కలెక్షన్స్ అన్నీ నేటితరం మహిళలను ప్రతిబింబించేలా ఉంటాయి. నా డిజైన్స్ చాలా స్టైలిష్ గా, చాలా డిఫరెంట్ గా ఉండడమే కాకుండా అన్ని అకేషన్స్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటాయని’ తెలిపింది.
అంతే కాకుండా లేటెస్ట్ వెయిట్ అండ్ గోల్డ్ ఆన్ లైన్ మార్కెటింగ్ కూడా మొదలు పెట్టిందని వైట్ అండ్ గోల్డ్ సిఈఓ సంతోష్ భాటియా తెలియజేశాడు. ఆన్ లైన్ షాపింగ్ కోసం Witengold.com ని విజిట్ చేయండి. తమన్నా ప్రస్తుతం తెలుగులో ‘బాహుబలి’ సినిమా చేస్తోంది, అలాగే రవితేజ సరసన బెంగాల్ టైగర్ సినిమా చేస్తోంది. బాహుబలి జూన్ లో రిలీజ్ కానుంటే బెంగాల్ టైగర్ అక్టోబర్ లో రానుంది.

