ఆ కారణంగానే ఐటమ్ సాంగ్స్ చేశాను – తమన్నా

Published on Aug 14, 2018 8:18 am IST

మంచు మనోజ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా. ఆ తర్వాత కూడా ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలోనే తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ సూర్య సినిమాలో నటించి హీరోయిన్ గా సక్సెస్ అయి మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కాగా తనూ ఈ స్థాయికి రావడానికి తన డ్యాన్స్‌ నే ప్రధాన కారణం అని చెప్పుకొచ్చింది తమన్నా. ఏ సినిమా ఇండస్ట్రీ లోనైన ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లోనే నిర్మిస్తారు. అందుకే హీరోయిన్స్ రోల్స్ కి ప్రాధాన్యం చాలా తక్కువుగా ఉంటుంది. ఆ ఉన్న కొన్ని సన్నివేశాల్లోనే మా టాలెంట్ ను చూపించాలి. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకోవాలి అందుకే నేను ఎక్కువుగా డ్యాన్స్ వైపే మొగ్గు చూపుతా. ఆ కారణంగానే కొన్ని ప్రత్యేక గీతాల్లో కూడా నటించాను. అని తెలిపింది తమన్నా. ప్రస్తుతం ఆమె సైరాలో చిరంజీవి పక్కన, ‘ఎఫ్‌2’ వెంకటేష్ సరసన నటిస్తోంది. అలాగే ఓ తమిళ చిత్రంలో తమన్నా నటించనుంది.

సంబంధిత సమాచారం :

X
More